మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 

చెప్పులతో కొట్టి నిరసన 

On

అంబేద్కర్ జిందాబాద్ అమిత్ షా ముర్దాబాద్

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) డిసెంబర్ 20: మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు పార్లమెంట్లో అమిత్ షా చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ సాక్షిగా అమిత్ షా దిష్టిబొమ్మని చెప్పులతో కొట్టి, అంబేద్కర్ జిందాబాద్, అమిత్ షా ముర్దాబాద్ నినాదాలతో  నిరసన తెలుపుతూ దిష్టిబొమ్మని అంబేద్కర్ విగ్రహానికి ఉరివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు నవతన్ మాట్లాడుతూ..గత రెండు రోజుల క్రితం పార్లమెంట్లో అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా పదేపదే అంబేద్కర్ పేరు తలుచుకునే దానికన్నా , దేవుని తలచుకోవటం మేలు అన్నారని ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ , రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మాకు దేవుడని అన్నారు. ఈ రాజ్యాంగం వల్లనే అమిత్ షాకు పార్లమెంట్లో స్థానం కలిగిందని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే పార్లమెంట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడితల పుష్పలత, గంధం కల్పన, పిఎన్ మూర్తి, పగిడిపల్లి శ్రీకాంత్, సిద్దు, ప్రేమ్, రాములు ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి