పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

వైసిపి జిల్లా ఉపాధ్యక్షులను కలిసి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బొగ్గుల ఆర్లప్ప 

On
పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.

న్యూస్ ఇండియా ప్రతినిధి / పెద్దకడుబూరు మండలం జూలై 12 :-  పెద్దకడబూరు మండల ఎస్సీ సెల్ నాయకులు బొగ్గుల అర్లప్ప మరియు పబ్లిసిటీ విభాగం తాలూకా అధ్యక్షులు జె. ముక్కరన్న లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి స్థానిక ఎమ్మిగనూరులో స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ నాయకులు బొగ్గుల ఆర్లప్ప మాట్లాడుతూ తనకు మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగ పదవిని అప్పగించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డికి వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఆర్. పురుషోత్తం రెడ్డికి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డికి, మంత్రాలయం తాలూకా బూత్ లెవెల్ విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డికి అలాగే నా పదవికి సహాయ సహకారాలు అందించిన ప్రతి మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ పదివి పై నమ్మకముంచి వైసీపీ పార్టీ బలోపేతానికి నా వంతు సహాయ సహకారాలు అందించి వైసీపీ పార్టీ గెలుపే దిశగా ముందుకు తీసుకెళ్తానని వైసీపీ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్కరన్న, ప్రసాదు,ఏసన్న,జాంబన్న, బొగ్గుల యువరాజ్,లోకయ్య, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు...IMG_20250713_060037

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'10 టీవీ' పేరు చాటున మోసాలు! '10 టీవీ' పేరు చాటున మోసాలు!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  19, న్యూస్ ఇండియా : పాకాల వెంకటేశ్వర్ రావు @10 టివి రిపోర్టర్ పి.వి రావు, వి రాజలక్ష్మి తో...
పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.