'10 టీవీ' పేరు చాటున మోసాలు!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 19, న్యూస్ ఇండియా : పాకాల వెంకటేశ్వర్ రావు @10 టివి రిపోర్టర్ పి.వి రావు, వి రాజలక్ష్మి తో ప్రత్యేక్షంగా, పరోక్షంగా చేసిన క్రిమినల్ ఆక్టివిటీస్ లో భాగంగా సంగారెడ్డి రురల్ పోలీస్ స్టేషన్లో తేది.28-03-2025 నాడు ఎఫ్.ఐ.అర్ నం.180-2025 నమోదు అయ్యింది. కంది, మామిడిపల్లి గ్రామా సరిహద్దుల్లో గతంలో ఐ.ఐ.టి హైదరాబాద్ నిర్మాణం కొరకై ప్రభుత్వం భూములను సేకరించింది. అట్టి భూముల్లో భూమి కోల్పోయిన వారికి కంది గ్రామం పరిధిలో, బెంగుళూర్ బైపాస్ రోడ్, ఆర్.టి.ఏ కార్యాలయం పక్కన ప్రభుత్వ భూమి లో ఇండ్ల స్థలాలు కేటాయించారు. 2009 ప్రొసీఈడింగ్ ప్రకారం 2011 సంవత్సరం లో భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు. 2011 నాటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఈ రాష్ట్రము ‘ఆంధ్రప్రదేశ్’ గానే కొనసాగుతున్నది. 2009 ప్రొసీడింగ్స్ ప్రకారం లబ్ది పొందడానికి ‘ఖచ్చితమైన కొన్ని అర్హతలు’ కలిగి ఉండాలి. 1.ప్రభుత్వం సేకరించిన భూమిలో భూములు కోల్పోయినవారి జాబితాలో పేర్లు నమోదు కాబడి ఉండాలి. 2. ప్రభుత్వ లబ్ధిదారుల జాబితాలో పేర్లు నమోదు కాబడి ఉండాలి. ఈ రెండు అర్హతలు లేకుండానే 10 టివి రిపోర్టర్ పి.వి రావు, వి.రాజలక్ష్మి లు అక్రమ పట్టా సంపాదించారు! కంది గ్రామం, సర్వే నం 616 లో 200 (రెండు వందల గజాల) ప్రభుత్వ భూమి ని ఎలా లబ్ధి పొందారు? అనే చిక్కుముడి విప్పవలసిన అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారా ? ఒక ‘ముఠ’ గా ఏర్పడి అవకతవకలకు పాల్పడ్డారా? 2011 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రా ఆవిర్భావం ఎలా జరిగింది? 2011 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సృష్టించారు? 2011 లో ఎవరి ఆలోచనలో నుండి ‘సంగారెడ్డి జిల్లా' ను సృష్టించారు? 2011 లోనే 'కంది మండలం' ఎట్లా సాధ్యమైంది? ఈ భవిష్యవాణి ఎవ్వరి సృష్టి? పోలీసులు ఈ చిక్కుముడి ని విప్పే పనిలో వున్నారు.
Comment List