నియోజక వర్గం లోని రైతుల సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరిస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి చెన్నూర్ రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరిన ఎమ్మెల్యే
పాలకుర్తి ప్రజల నీటి కష్టాలు తీర్చగలమన్న ఎమ్మెల్యే!
**పాలకుర్తి నియోజకవర్గానికి నీటి విడుదల చెయ్యాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.*
న్యూస్ ఇండియా తెలుగు పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,
జూలై 20,
పాలకుర్తి నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి సమస్యలు ఎదురవుతున్న రైతులకు తక్షణ సాయంగా నీటిని విడుదల చేయాలని కోరుతూ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తంకుమార్ రెడ్డి గారిని ఈ రోజు ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు ప్రత్యేకంగా కలుసుకున్నారు..
ఈ సందర్భంగా మంత్రి గారి అధ్యక్షతన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తక్షణ నీటి విడుదల అత్యవసరమని పేర్కొన్నారు..
అదేవిధంగా, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి గారిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కోరారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలోని వేలాది ఎకరాల పొలాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి, రైతులకు గొప్ప మద్దతు లభిస్తుందని వెల్లడించారు..
ఈ అభ్యర్థనలపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన నీటి విడుదలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే చెన్నూరు రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి స్పందనను రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
Comment List