సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ముఖ్యఅతిథిగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస్
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే గుణం ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఖమ్మం నగరం పంపింగ్ వెల్ రోడ్ అభినవ్ హై స్కూల్ లో కరస్పాండెంట్ రమణ,డైరెక్టర్ అరుణ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి పిల్లలతో స్వయంగా అనాధలకు వృద్ధులకు వికలాంగులకు చేయూత ఇవ్వడం కోసం పిల్లలచే బియ్యం,పప్పు సేకరణ చేసి బుధవారం అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వితరణ చేశారు.ఇక్కడ చదివే పిల్లలకి కూడా అభినవ్ హై స్కూల్ యాజమాన్యం చేయూతనిస్తుంది.అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఈ స్కూల్ విద్యార్థులు పలుమార్లు అన్నం ఫౌండేషన్ కు విరాళాలు అందించడం మరువలేమన్నారు.ఇదే సేవా దృక్పథాన్ని విద్యార్థులు భవిష్యత్తులోనూ కొనసాగించాలని అన్నారు.డైరెక్టర్ అరుణ మాట్లాడుతూ..ఈ రోజులలో చదువు అంటే కేవలం మార్కుల కోసం,ర్యాంకుల కోసం మాత్రమే కాదు పిల్లలు ఉన్న నైపుణ్యాన్ని బయటకి తీయడమే మా ఉద్దేశం అన్నారు.అంతేకాకుండా పిల్లలలో సేవా గుణం కల్పించే విధంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తద్వారా తమ స్కూలు నుండి బయటకు వెళ్లిన విద్యార్థులు సేవా కార్యక్రమాలు కూడా పాలుపంచుకుంటారని అన్నారు.ఉచిత క్యాన్సర్,స్క్రీనింగ్ క్యాంప్,విపత్తుల సమయంలో నిరాశ్రయులకు అండగా నిలిచేందుకు విరాళాలు సేకరణ, అభాగ్యులను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు ఇలా ప్రతి కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Comment List