కొరిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లా:-
పెద్ద వంగర మండలం:-
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కొరిపల్లి గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొట్టిముక్కల సిద్ధార్థ్ రెడ్డి, మహ్మద్ అసద్ అనే ఇద్దరు మైనర్ బాలురు బైక్‌పై వేగంగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ముందు భాగాన్ని ఢీకొన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి బైక్ అధిక వేగమే కారణమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాలుర ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైక్ వేగం ప్రాణాలపై ప్రభావం చూపుతుందని, యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని స్థానికులు సూచిస్తున్నారు.

Comment List