యథేచ్ఛగా రాత్రివేళలో చెరువు  మట్టి తవ్వకాలు

విషయం తెలిసిన తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

యథేచ్ఛగా రాత్రివేళలో చెరువు  మట్టి తవ్వకాలు

చెరువు  మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నయి. సంబంధిత అధికారులు ముడుపులు తీసుకొని నచ్చిన చోట తోసినంత తరలించుకునే అవకాశం కల్పిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టి నిర్వాహకులు గత రెండు నెలలుగా డబ్బులు చేత పట్టుకొని సారవంతమైన రేగడి మట్టి కోసం అన్వేషిస్తున్నారు. చెరువులోని నీరు తగ్గగానే రేగడి మట్టి వేట మొదలైంది. ఇదంతా ఎక్కువగా మే, జూన్ నెలల్లో జోరుగా సాగుతుంది. ఇటుక బట్టీల నిర్వాహకులు మాత్రం ఇష్ట రాజ్యాంగ చెరువులు కుంటల్లోని మట్టిని తవ్వి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రకృతి సంపద హరించుకుపోతుంది.
మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలోని చెరువు నుండి జెసిబితో రాత్రివేళ అక్రమంగా పత్తేపురం స్టేజి సమీపంలోని ఇటుక బట్టీలకు రేగడి తరలిస్తుండగా ట్రాక్టర్లను ఆపి ఆందోళన చేస్తున్న గోపాలగిరి గ్రామస్తులు .. రేగడి తోలొద్దని ఉదృతం చేస్తున్న ప్రజలు…నాయకులతో బేరాలు మాట్లాడుకుని ప్రశ్నించిన వారితో కూడా బేరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్న ఇటుక బట్టి నిర్వాహకులు.. ఇటుక బట్టీ నిర్వాహకులు రేగడి మట్టి తవ్వకాన్ని అడ్డుకున్న ప్రజలతో బేరాలు మాట్లాడుతూ మీకు ఇటుక కావాలంటే ఫ్రీగా రెండు మూడు ట్రిప్పులు పంపిస్తామని బేరాలు మాట్లాడుతున్నారని గోపాలగిరి ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి తవ్వకాలతో చెరువులోని రేగడి మట్టిని తవ్వి పెద్ద పెద్ద లోయలు చేస్తున్నారని దానివల్ల గ్రామస్తులకు ప్రమాదమని గ్రామస్తులు రేగడి తరలిస్తుంటే అడ్డుకున్నారు. జెసిబి ట్రాక్టర్ ల సహాయంతో ఇటుక బట్టీలకు రాగడి మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులు కుంటలు మరియు ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూముల అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిపి రేగడి మట్టిని అమ్ముకొని లక్షల్లో సంపాదిస్తున్నారు. అదే పంట పొలాల్లోకి సారవంతమైన రేగడి తరలిస్తామంటే మాత్రం అధికారులు ప్రజా ప్రతినిధులు లేనిపోని నిబంధనలు పేరుతో ప్రజలను భయపెడతారని, వ్యాపారులు దొంగ చాటున తరలించేందుకు ఎలాంటి నిబంధనలు అడ్డు రావడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి జెసిబిలతో మట్టిని తవ్వి, ట్రాక్టర్లతో అక్రమంగా పత్తేపురం స్టేజి వద్ద ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తుండగా గోపాలగిరి గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ, పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే జరుగుతున్నా, అధికారులు ఎక్కడ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని అనుమానం సగటు పౌరునికి కలుగుతుంది. ముఖ్యంగా మట్టి తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ, యంత్రాంగం, మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, నిద్రమత్తులో తూగుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వాహనదారులకు పట్టలేని దుమ్ము

తొర్రూరు మడలంలోని వరంగల్, ఖమ్మం హైవే మరియు నెల్లికుదురు రోడ్లకు ఆనుకొని కొన్ని విలేజీలకు ఆను ఇటుక బట్టీలు ఉండడంతో గ్రామస్తులకు బాటసారులకు రోజువారి వాహనదారులకు  అధిక దుమ్ముదూళితో రోగాల పాలవుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికి ఎన్నోసార్లు స్థానిక ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చర్యలకు పాల్పడని వైనం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇటుక బట్టిలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Views: 81
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?