బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జిల్లా
ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, జిల్లా యువ అధికారి భూక్య ప్రవీణ్ సింగ్, అకౌంట్స్ మరియు ప్రోగ్రామ్ అధికారి కమరతపు భానుచందర్ వారి ఆదేశాల మేరకు పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ రఘునాధపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు కబడ్డీ, బ్యాడ్మింటన్ (షటిల్), 200 మీటర్ రన్నింగ్, ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్టు, మెడల్స్, మెమెంటోస్ మరియు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కోచ్ సునీత కి నెహ్రూ యువ కేంద్ర ధన్యవాదాలు తెలిపింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List