గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్

చాకచక్యంగా పట్టుకున్న రూరల్ పోలీసులు....పీడీ యాక్ట్ హెచ్చరిక

గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా:-IMG-20260607-WA0036

గతంలో క్రైమ్ నంబర్ 60/2026 గంజాయి రవాణా కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మహబూబాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఆధ్వర్యంలో, రూరల్ ఎస్సై పిల్లల రాజు మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక చర్యల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, అడ్వకేట్ కాలనీకి చెందిన పాయలి క్రాంతి కుమార్ (34) గతంలో నమోదైన గంజాయి రవాణా కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడు తన నివాసంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుడిని విచారించిన పోలీసులు అతని వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ, గంజాయి వినియోగం, విక్రయం, నిల్వ, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని, సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తారని పేర్కొన్నారు.
"గంజాయి అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం" అని రూరల్ సీఐ స్పష్టం చేశారు.

Views: 191
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్