ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత 

రేపు ఉదయం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి 

On
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత 

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 21 :ఇల్లందు క్రాస్ నుండి బొమ్మనపల్లి క్రాస్ మధ్యలోని లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (NH-930P)పై ఉన్న ఓవర్ బ్రిడ్జికి చేపట్టిన మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అమలులో ఉన్న ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలను రేపు ఉదయం అనగా 22.07.2026, 08:00 గంటల నుండి ఎత్తివేస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.రేపు ఉదయం నుంచి వాహనాలు యథావిధిగా ఓవర్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, సూచిక బోర్డులు మరియు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల సహకారంతో మరమ్మత్తు పనులు సజావుగా పూర్తయ్యాయని, భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ నిర్వహణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా మరమత్తు పనులను పూర్తి చేయడంపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత అధికారులను, ఇంజినీరింగ్ సిబ్బందిని మరియు పోలీసు అధికారులను అభినందించారు.

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News