సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి
సిపిఐ ఎంల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిచ్చం డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జులై 19 : నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ కు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ దీఛ్ఛను భగ్నంచేయడాన్ని వ్యతిరేకిస్తూ,కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం లో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ముద్దా బిచ్చం మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే లీకేజీ కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను పోలీసులుభగ్నం చేసి, నిర్బంధించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి ఉద్యమాలను అణచివేయడం, పోలీసు బలగాలను ఉపయోగించి నిరసనకారులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం నిరసనలను అణచివేయడం కాకుండా బాధ్యతాయుతంగా స్పందించాలని డిమాండ్ చేశారు.ప్రజా నిరసనలను గౌరవించి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపే వరకు సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నాయిని రాజు. జాటోత్ కృష్ణ. అమర్లపూడి రాము. బానోతు ధర్మ, వై గోపాల్ రావు, పి సతీష్, పిడిఎస్యు నాయకులు పృద్వి, బుర్ర వీరభద్రం, మునగలు శివ, టియుసిఐ నాయకులు రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comment List