తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా ఐజేయు సంఘం కోశాధికారి బిజ్జాల వెంకటరమణ

తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

మహబూబాబాద్ జిల్లా::-

తొర్రూరు డివిజన్ కేంద్రం::-IMG_20260702_114533  IMG_20260702_114533



తొర్రూరు డివిజన్ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా ఐజేయు సంఘం కోశాధికారి బిజ్జాల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన జర్నలిస్టు సంఘం ఐజేయు కాగా, రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలతో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంఘం కొనసాగుతోందని పేర్కొన్నారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సంఘం సభ్యత్వాన్ని స్వీకరించారు.

Views: 2
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్