సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు

కార్మికుల చెమటను రాజకీయ లాభాలకు వాడుకోవద్దు

On
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 3 :సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాల అంశంపై మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడాలనుకుంటే దానికి సరైన వేదిక తెలంగాణ శాసనసభ. అక్కడ ప్రభుత్వం సమాధానం చెబుతుంది, అవసరమైతే సింగరేణి యాజమాన్యం కూడా అధికారికంగా వివరణ ఇస్తుంది,కానీ గనులపైకి వచ్చి పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సింగరేణి సంస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల సంస్థ ప్రతిష్ట,పరపతి దెబ్బతింటుందని ఏఐటీయూసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 7.5 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి చూపించారని, అప్పట్లో ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ బహిరంగంగా విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు మౌనం వహించిన వారు, ఇప్పుడు నీతులు చెప్పడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. మేము ఈ విధానాన్ని తప్పు పడుతున్నాము.ప్రభుత్వం ఎవరిదైనా, తప్పు జరిగితే ప్రశ్నించడం మా విధానం.బొగ్గు ఉత్పత్తి గణాంకాలపై అనుమానాలు ఇవాళ కొత్తగా వచ్చినవి కావు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు నిర్వహించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ అవసరాలకు అనుగుణంగా సింగరేణిని రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడం కొత్త విషయం కాదు. అయితే ఏఐటీయూసీ మాత్రం మొదటి నుంచీ ఒకే విధానాన్ని అనుసరిస్తోంది. సింగరేణి ప్రతిష్టకు భంగం కలిగించే రాజకీయాలను ఎవరు చేసినా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.మా యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనoనేని సాంబశివరావు మిమ్మల్ని ఎల్లప్పుడూ "హరీష్‌రావు గారు" అని గౌరవంగా సంబోధించారు. కానీ మీరు మాత్రం "సాంబశివరావు" అంటూ పదేపదే ఏకవచనంతో సంబోధించడం హుందాతనo కాదు. విభేదాలు ఉండవచ్చు, విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్య సంస్కృతికి తగదు.రాజకీయాల్లో పరస్పర గౌరవాన్ని పాటించడం ప్రతి నాయకుడి బాధ్యత,మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు మా గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన సమాధానాన్ని కావాలనే వక్రీకరించడం దురుద్దేశపూరితం. ఆయన ఎక్కడా "బొగ్గు ఎక్కడ కూడా దొంగతనం జరగలేదు" అని చెప్పినాడు, టార్గెట్ రాకున్నా వచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపెట్టారు. ఈ పద్ధతికూడా తప్పే అని కూడా చెప్పారు. బొగ్గు దొంగతనం జరిగింది అని చెప్పడం వలన కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు అయోమయానికి గురవుతారని మాత్రమే పేర్కొన్నారు. కార్మికుల గౌరవాన్ని, సంస్థ విశ్వసనీయతను కాపాడాలన్నదే ఆయన ఉద్దేశం. ఆ వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి ఆయుధంగా మార్చే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలి. దాదాపు 70 వేల మంది శాశ్వత, కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తు, వారి కుటుంబాల జీవనోపాధి కంటే ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత దురదృష్టకరం.గనులపైకి వందలాది మంది బొగ్గు చూపెట్టండని అధికారులపై వత్తిడి తెస్తే కార్మికులు అభద్రతకు లోనవుతారు.సింగరేణిని రాజకీయ రణరంగంగా మార్చే ప్రతి ప్రయత్నాన్ని కార్మికలోకం తిప్పికొడుతుంది.ఇప్పటికే సింగరేణిలో అధిక రాజకీయ జోక్యం, అవినీతి వల్ల సంస్థ తీవ్రంగా నష్టపోయింది.సింగరేణికి భవిష్యత్తులేని పరిస్థితి నెలకొంది.ఈ వాస్తవాన్ని కార్మికులు గమనిస్తున్నారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసే, సింగరేణి ప్రయోజనాలకు భంగం కలిగించే రాజకీయ జోక్యాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.సింగరేణిని రాజకీయాలకు అతీతంగా ఉంచడం, కార్మికుల హక్కులను కాపాడడం, సంస్థ ప్రతిష్టను పరిరక్షించడం, సంస్థ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం ఏఐటీయూసీ లక్ష్యం.ఈవిషయంలో కార్మిక సోదరులు ఐక్యమత్యంగా ఉండాలని ఒక ప్రకటనలో ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు.

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!
ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్!
హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!
5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!