శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 

తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు..

On
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 

తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి:

IMG-20260627-WA0613(1)
తనిఖీలలో పాల్గొన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, సిబ్బంది..

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో శేరిగూడలోని శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బస్సుల్లో పలు భద్రతా లోపాలు వెలుగుచూశాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. జితేందర్ రెడ్డి శనివారం సిబ్బందితో కలిసి కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంతో పాటు బస్సుల భద్రతా తనిఖీలు చేపట్టారు. మొత్తం 13 కళాశాల బస్సులను తనిఖీ చేసిన అధికారులు వాహనాల ఫిట్‌నెస్, రోడ్ వర్తీనెస్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, సంబంధిత పత్రాలు, అత్యవసర భద్రతా పరికరాలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు లోపాలున్నాయి. తనిఖీ చేసిన 13 బస్సుల డ్రైవర్లలో ఒక్కరూ నిర్దేశిత యూనిఫాం ధరించకపోవడం, అన్ని బస్సుల్లోనూ విద్యార్థుల భద్రత కోసం తప్పనిసరిగా ఉండాల్సిన అటెండెంట్ లేదా హెల్పర్‌ను కళాశాల యాజమాన్యం నియమించకపోవడం అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నలుగురు డ్రైవర్లు 60 సంవత్సరాలకు పైబడిన వారిగా తేలింది. అలాగే కొన్ని బస్సుల టైర్లలో ట్రెడ్ లోతు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం, ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు పనిచేయకపోవడం, ఒక బస్సులో అత్యవసర నిష్క్రమణ ద్వారం లేకపోవడం, మరికొన్ని బస్సుల్లో ప్రమాద సమయంలో అద్దాలు పగులగొట్టేందుకు అవసరమైన ఎమర్జెన్సీ హ్యామర్లు లేకపోవడం వంటి లోపాలను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గుర్తించిన అన్ని లోపాలను వెంటనే సరిదిద్దాలని కళాశాల యాజమాన్యాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. ప్రతి బస్సులో అటెండెంట్‌ను నియమించడంతో పాటు డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, వాహనాలను ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించబోమని, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని హెచ్చరించారు. అలాగే విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు.

Read More డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్