ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించిన : ఎస్పీ
బాలల సంరక్షణ కై అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 29 :జనవరి 1వ తేదీ నుండి నెల రోజుల పాటు నిర్వహించబడే ఆపరేషన్ ముస్కాన్ -12 వ విడత కార్యక్రమంపై కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం కాన్ఫరెన్స్ హాల్ నందు అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ,చైల్డ్ హెల్ప్ లైన్1098, కైలాష్ సత్యర్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ఎన్జీవో,విద్యాశాఖ, వైద్య శాఖ,కార్మిక శాఖకి చెందిన అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హాజరై ఆపరేషన్ ముష్కన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్ భారతదేశ వ్యాప్తంగా తప్పిపోయిన పిల్లలను, భిక్షాటన చేయుచున్న పిల్లలను, నిరాదరణ కలిగిన పిల్లలకు, బాల కార్మికులను సంరక్షించే ప్రాథమిక ఉద్దేశాలతో నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమం వలన బాధితులైన పిల్లల్ని సంరక్షించి వారి కుటుంబాలకు అప్పగించడం జరుగుతుందని. ఈ సంవత్సరము 12 వ విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జులై 1 తారీకు నుంచి 31వ తారీకు వరకు జిల్లా పరిధిలో నిర్వహిస్తు బాలల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా పోలీస్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని,అంతేగాక హాజరైన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచనలు చేశారు.కొత్తగూడెం జిల్లా పరిధిలో ఎవరైనా 18 సంవత్సరాలలోపు పిల్లల్ని హింసించిన ,భిక్షాటన చేపించిన ,పిల్లల్ని బాల కార్మికులు గా మార్చిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిసిఆర్బి డిఎస్పి మల్లేష్ స్వామి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ లెనినా స్వర్ణలత, డీసీపీవో హరి కుమారి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రాము,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ నాగరాజు, శాస్త్రి, ఏసుపాదం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిస్టిక్ కో ఆర్డినేటర్ సైదులు, కేఎస్సిఎఫ్ కో ఆర్డినేటర్ రాజేష్, మరియు కమిటీ మెంబెర్స్, ఎస్సైలు రమాదేవి, రాంబాబు, రామ్మూర్తి, రావూఫ్, వెంకన్న, సారంగపాణి, లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comment List