బండరావిరాలలో 'ఏకో టౌన్' ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం: మంచిరెడ్డి కిషన్ రెడ్డి ..

29న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
బండరావిరాలలో 'ఏకో టౌన్' ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం: మంచిరెడ్డి కిషన్ రెడ్డి ..

ఏకో టౌన్ పేరుతో చెత్త యార్డు వద్దు..

 

బండరావిరాలలో డంపింగ్ యార్డ్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకం..

 

29న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

 

రంగారెడ్డి జిల్లా,, జూన్ 28 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 268లో 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రతిపాదించిన ‘ఏకో టౌన్’ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించనున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు కోరుతూ బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఆయనను నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జవహర్‌నగర్ తరహాలో ప్రమాదకరమైన చెత్త డంపింగ్ యార్డును ‘ఏకో టౌన్’ పేరుతో బండరావిరాలతో పాటు చిన్నరావిరాల, పిల్లాయపల్లి, బాచారం, గౌరెల్లి, సద్దిపల్లి, తారమతిపేట, కావాడిపల్లి, బలిజగూడ తదితర గ్రామాల సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 15 గ్రామాల పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే భూమిలో ఐటీ, సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. మూసీ పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఇప్పుడు ఏకో టౌన్ పేరుతో మరోసారి గ్రామాలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జనావాసాలకు దూరంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగే కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

IMG-20260628-WA1250
ఎకో టౌన్ ప్రాజెక్టుకు టిఆర్ఎస్ వ్యతిరేకం మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ పరిధిలో ప్రతిపాదిత 'ఏకో టౌన్' (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 15 గ్రామాల పర్యావరణం, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఐటీ, పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 29న నిర్వహించే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Read More అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్