ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి

తోరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి

పాలకుర్తి నియోజకవర్గం:-IMG-20260627-WA0018

పాలకుర్తి నియోజకవర్గంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, వారానికి మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు రాగిజావతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, జీవన నైపుణ్యాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.పా

నేటి పరిస్థితుల్లో అధిక ఫీజులు చెల్లించినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందనే హామీ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు.

Read More డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్వీకరిస్తున్న ప్రజలు, అదే ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, నాణ్యమైన విద్యను కూడా విశ్వసించాలని కోరారు. దేశంలోని ఎందరో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయమూర్తులు, పరిపాలనాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తుచేశారు.

Read More అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

"విజయానికి పాఠశాల పేరు కాదు... విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే పునాది. కాబట్టి పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని" అనుమాండ్ల తిరుపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

Views: 0
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్