బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

On
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్, జులై 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.

IMG-20260712-WA1409
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించిన చిన్న జీయర్ స్వామి..

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చిన్న జీయర్ స్వామి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు విశేషాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి అందాల మధ్య గుట్టలపై అత్యాధునిక సౌకర్యాలతో 189 పూర్తిస్థాయి సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ విల్లాలను నిర్మిస్తున్నట్లు జనప్రియ సంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎండీ క్రాంతి కిరణ్ రెడ్డి తెలిపారు. నాణ్యత, ఆధునిక నిర్మాణ ప్రమాణాలు, విశాలమైన సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, కొనుగోలుదారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ప్రాంతీయ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపునిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Views: 37

About The Author

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు