అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

On
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత కిషన్‌రెడ్డి మునగనూరుకు వచ్చి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి విమర్శించారు. మునగనూరు సర్వే నంబర్ 44లో భూముల కబ్జాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని, 2023లో భూముల రిజిస్ట్రేషన్లు జరిగితే అప్పటి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదో ప్రజలకు తెలుసని అన్నారు. విషయం తమ దృష్టికి రాగానే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి, సంబంధిత భూముల్లో ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. తమ లక్ష్యం అభివృద్ధి మాత్రమేనని, భూముల దోపిడీ కాదని పేర్కొన్నారు. ఫార్మాసిటీ, అబ్దుల్లాపూర్‌మెట్, మునగనూరు తదితర ప్రాంతాల్లో భూవివాదాలపై కిషన్‌రెడ్డి వైఖరినే ప్రశ్నించారు. అవసరమైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతామని, కబ్జాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. ఇకపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్