డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

On
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

IMG-20260706-WA0799
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన భాగ్యమ్మ..

డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

రంగారెడ్డి, జూలై 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: తన పేరుపై కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం వేసి, కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సబితా నగర్‌కు చెందిన భాగ్యమ్మ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో కుటుంబానికి చెందిన సామగ్రితో పాటు పిల్లల పాఠశాల యూనిఫామ్‌లు కూడా ఉండిపోవడంతో తన నలుగురు పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి పీఏ సూచించినప్పటికీ ఇంట్లోకి అనుమతించడం లేదని, పైగా ఇంటి పట్టా రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వెంటనే ఇంటి తాళాలు తెరిపించి తమను ఇంట్లోకి అనుమతించాలని, న్యాయం చేయాలని జిల్లా అధికారులను వేడుకుంది. ఈ ఫిర్యాదుపై అధికారులు స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె కోరింది.

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్