పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 

ఘన స్వాగతం పలికిన జిల్లా పోలీసులు

On
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 

 భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా ప్రతినిధి ) జూలై 6 :జిల్లాలోని హేమచంద్రపురం  పోలీస్ హెడ్ క్వార్టర్లో  నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ సోమవారం  ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి భవనాన్ని ప్రారంభించిన ఆయన, గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులను పరిశీలించి అధికారులతో డీజీపీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు అధికారిక పర్యటనల సమయంలో ఈ గెస్ట్ హౌస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీసు సిబ్బందికి మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 185
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్