#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం

గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ

On
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం

IMG-20260719-WA0025

IMG-20260719-WA0022  IMG-20260719-WA0025   IMG-20260719-WA0023

IMG-20260719-WA0028 శేరిలింగంపల్లి, మదీనాగూడ:

గౌతమ్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ది.17-07-2026 నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీలో విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేస్తున్న ముఖ్య అతిథి జి. హనుమంతరావు, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–1), సైబరాబాద్. కార్యక్రమంలో డీన్ భరద్వాజ్, ప్రిన్సిపల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు.

Read More మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి. హనుమంతరావు, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–1), సైబరాబాద్, మరియు డీన్ భరద్వాజ్ హాజరయ్యారు. వారు నూతనంగా ఎన్నికైన విద్యార్థి కౌన్సిల్ సభ్యులకు బ్యాడ్జీలు, సాష్‌లు ధరింపజేసి బాధ్యతలను అప్పగించారు.

ఈ సందర్భంగా జి. హనుమంతరావు మాట్లాడుతూ, నాయకత్వం అనేది పదవి మాత్రమే కాదని, సేవాభావం, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతతో వ్యవహరించడమే నిజమైన నాయకత్వమని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

డీన్ భరద్వాజ్ మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సమయపాలన, జట్టు భావన వంటి విలువలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడుతూ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రిన్సిపల్ సంధ్యారాణి మరియు డీన్ భరద్వాజ్ కలిసి ముఖ్య అతిథి జి. హనుమంతరావు, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–1), సైబరాబాద్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయనకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

విద్యార్థుల ప్రమాణ స్వీకారం, సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథుల సందేశాలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ఇంచార్జ్ కనకయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు