యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

On
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జూలై 19, న్యూస్ ఇండియా ప్రతినిధి: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంజుల అనే మహిళకు నీలాద్రి ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. అయితే ఆమెకు కొన్ని యాంటీబయాటిక్‌ మందులు పడవని ముందుగానే వైద్యులకు తెలిపినా పట్టించుకోలేదని కుటుంబీకులు ఆరోపించారు. ఆపరేషన్‌ అనంతరం మంజుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మంజుల మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు