అధర్యపడొద్దు అండగా ఉన్నా- వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి భరోసా...!

- బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని వైసీపీ యువనేత వై.ప్రదీప్ రెడ్డి భరోసా.

On
అధర్యపడొద్దు అండగా ఉన్నా- వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి భరోసా...!

- ఎమ్మెల్యే ఆదేశాలతో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి 50వేలు ఆర్థిక సహాయం.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం సాయంత్రం వేళలో స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంచోది శాంతిరాజు యొక్క ఇంటిలో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సుమారు 5లక్షల వరకు ఆస్థి నష్టం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే గురువారంరోజు మంత్రాలయం నియోజకవర్గం వైసిపి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి ఆదేశాలతో వైసీపీ యువనేత వై. ప్రదీప్ రెడ్డి 25వేలు మరియు పెద్దకడుబూరు వైసీపీ పార్టీ నేతలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.రామలింగారెడ్డి, ఆర్.రవిచంద్రా రెడ్డి, ఆర్. శివరామి రెడ్డి, సర్పంచ్ రామాంజినేయులు మరియు వార్డు మెంబెర్ బ్రమ్మయ్య ఆచారి అందరూ 25వేలతో కలిపి మొత్తం 50,000/-రూపాయలు అగ్నిప్రమాదం జరిగిన మంచోది శాంతిరాజు అనే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులెవ్వరు అధర్యపడొద్దు అండగా అండగా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ప్రదీప్ రెడ్డితో పాటు మేమంతా ఉన్నాం అని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందేలా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ప్రదీప్ రెడ్డితో పాటు మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు...ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, సుందరం, ప్రసాద్, రాజు మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.IMG_20240926_230256

Views: 133
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News