బంగారం "చోరీ" కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

కేసుకు కీలకంగా మారిన సీసీ పుటేజులు

On
బంగారం

5 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు,28000 నగదు రికవరీ వివరాలు వెల్లడించిన డిఎస్పి

Screenshot_2024-10-22-19-17-08-45_7352322957d4404136654ef4adb64504చుంచుపల్లి (న్యూస్ ఇండియన్ నరేష్)అక్టోబర్ 22: బంగారు చోరీ కేసులో నలుగురు నిందితులను చుంచుపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా బంగారం చోరీ కేసును చాకచక్యంగా చేదించినట్లు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పి వివరాలు తెలుపుతూ.. అక్టోబర్ 9 వ తారీఖున రైటర్ బస్తీకి చెందిన వెంకటేశ్వర్లు అనే రిటైర్డ్ ఎంప్లాయ్ దసరా పండుగ సందర్భంగా బ్యాంకు లాకర్ లో ఉన్న 19 తులాల బంగారాన్ని విడుదల చేసుకున్నాడు. అనంతరం దారిలోని విద్యానగర్ కాలనీలోని ఆర్కే సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపి కిరాణా సామాన్ తీసుకొని వచ్చి వెనుక వైపు డిక్కీ ఓపెన్ చేసి కిరాణా సామాన్లు పెడుతుండగా అదే అదునుగా భావించిన తంబాల నితిష్, మరో ముగ్గురు సహాయంతో ఆటోలో వచ్చి, కారు డోర్ ఓపెన్ చేసి కార్ లో ఉన్న బంగారాన్ని అపరించుకొని అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం కారులో బంగారం చోరీకి గురిందని గమనించిన వెంకటేశ్వర్లు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.రంగంలో దిగిన పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి కదలికల పై నిఘా ఉంచి చాకచక్యంగా మంగళవారం అరెస్టు చేశారు .తంబాల నితిన్ తో పాటు నిమ్మల వినయ్, గుంజి వీరబాబు, మహమ్మద్ నయీమ్, అదుపులోకి తీసుకొని విచారించగా ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన 19 తులాల బంగారంకీ గాను , 5 తులాల బంగారం,3 సెల్ ఫోన్లో, 28000 నగదును రికవరీ చేసి, నిందితులను రిమాండ్ పంపినట్లుగా డిఎస్పి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలొ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ప్రవీణ్ ,రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!