‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!

సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ ఎస్ఐ, సిఐల సంపూర్ణ మద్దత్తు

On
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  29, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మెయిన్ రోడ్, ఐటిఐ ప్రక్కన వున్నా 'రేణుక మాత  వైన్స్' లో గత వారం రోజుల క్రితం నుండి  పట్టపగలు 6.45 నిముషాలకు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు ప్రారంభించబడి, యథావిధిగా కొనసాగుతున్నవి. ఈ సమయ పాలనా ఉల్లంఘన పట్ల సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ నిర్వాకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్సైజ్ శాఖ, సంగారెడ్డి జిల్లా కార్యాలయం కూత వేటు దూరంలోనే ఉన్నా... ఈ అక్రమ అమ్మకాలకు కట్టడి చెయ్యలేని దుస్థితిలో ఎక్సైజ్ శాఖ ఎస్ఐ, సిఐ లు వున్నారు. సమయపాలన ఉల్లంఘించి జరుగుతున్నా ఈ అమ్మకాల పట్ల సంగారెడ్డి పట్టణ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ, సిఐ లకు సాక్షాదారాలతో పాటు పూర్తి సమాచారం ఉన్నపటికీ వారి వ్యవహారం మాత్రము ‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ అనే విదంగా కొనసాగుతున్నట్టు స్పష్టమౌతుంది. మద్యం ప్రియులకు మద్యం మత్తు, సంబంధిత అధికారులకు లంచాలు మత్తు కాబట్టే ఈ విదంగా పట్టపగలు అమ్మకాలు జరుగుతున్నవి అంటూ మద్యం ప్రియులు అధికారుల పట్ల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయం వారి పై అధికారుల ద్రుష్టి కి వెళ్లి సమయపాలన లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట పడుతుందో, లేదో.. చూడాలి?WhatsApp Image 2025-07-25 at 11

Views: 47
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు పట్టణం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని అభ్యాస్ స్కూల్లో చదువుతున్న నల్లగొండ జిల్లా, తిరుమలగిరి మండలం, వెలిశాల గ్రామం మర్రికుంట తండా కు...
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..
అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ'
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..
సుజాత నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఓఎస్డి