మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

On
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జులై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: రానున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్‌లోని శ్రీ భవాని శంకర్ ఆలయం, పోచమ్మ ఆలయం వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న 30 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహం ఏర్పాటుకు తొలి కర్ర పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై తొలి కర్రను ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల ప్రతిష్ఠను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో మహోత్సవాలను నిర్వహిస్తున్న యువతను అభినందించారు. శ్రీ గణనాథుని అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సుభిక్షం కలగాలని, గడ్డిఅన్నారం డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలకూరి రామ్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాశ్, నాయకులు, కార్యకర్తలు, శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News