తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు

ఎస్సై మహేందర్ రెడ్డి

తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు

మహబూబాబాద్ జిల్లా 
తొర్రూరు, ఆగస్టు 13:

IMG-20260813-WA0005
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తండాలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.
అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Views: 85
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News