ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..

రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ..

On
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..

రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పెద్ద అంబర్‌పేట్ ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్, ఆటోనగర్ ఇసుక లారీ యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లారీలను తమ ఆధీనంలోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతోందని, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్న లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్, జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు భవిష్యత్తులో కూడా అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Views: 118

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News