రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు

అధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం

రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు

మహబూబాబాద్ జిల్ల

తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన
అధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశంIMG_20260728_091619

తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. గ్రామాలు, తండాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో రూ.5.07 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, మహిళా సమైక్య భవనాలు తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రారంభించిన పనులు ఏ పరిస్థితుల్లోనూ నిలిచిపోకుండా నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు వివిధ కారణాలతో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూడా వెంటనే పునఃప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సీరియస్‌గా సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.

Views: 19
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News