మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి

చెర్లపాలెం పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిపై తీవ్ర ఆరోపణలు..!

మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి

మహబూబాబాద్ జిల్లా :-
తొర్రూరు సెంటర్ :-

చదువుల నిలయంగా పేరొందిన చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో ఓ గణిత ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరుణాకర్ రెడ్డి అనే గణిత ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి తొలగించాలని లేదా బదిలీ చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

గణిత బోధనపై తగిన పరిజ్ఞానం లేదని, విద్యార్థులకు సరైన రీతిలో బోధించడం లేదని ఆరోపిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

ఇంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

Read More పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

*విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు..!*

ఇక గతంలో పదో తరగతి విద్యార్థినుల పట్ల కరుణాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కూడా వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గతంలో గ్రామస్తులు ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను తేల్చాల్సిన బాధ్యత అధికారులదేనని గ్రామస్తులు అంటున్నారు.

ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా కేవలం షోకాజ్ నోటీసులతోనే వ్యవహారాన్ని ముగించడం ఎందుకు?నాలుగేళ్లుగా వస్తున్న ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ ఎందుకు జరగలేదు?విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసమేనా?

అంటూ గ్రామస్తులు నిలదీస్తున్నారు.

**అధికారుల మౌనంపై అనేక అనుమానాలు..!*

పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావడంతో ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలి.. ఆరోపణలు నిరాధారమైతే పూర్తి వాస్తవాలను ప్రజల ముందు వెల్లడించాలి అని వారు కోరుతున్నారు

విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని నిష్పక్షపాత విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థుల నుంచి కూడా వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

చెర్లపాలెం ఉన్నత పాఠశాలలో వినిపిస్తున్న ఈ ఆరోపణలు ఇప్పుడు విద్యాశాఖ అధికారుల తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడకుండా అధికారులు వెంటనే విచారణ చేపడతారా? లేక ఈ వ్యవహారం కూడా షోకాజ్ నోటీసులకే పరిమితమవుతుందా?ఇప్పుడు చెర్లపాలెం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. 

*పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం పై అధికారులకు చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది పై అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని చర్యలు మాత్రం ఏమీ లేవని ఇప్పటికి కూడా విషయాన్ని పై అధికారులకు చేరవేశామని తదుపరి నిర్ణయం వారిపైనే ఆధారపడి ఉంటుందని చేతులు దులుపుకోవడం గమనార్హం*.

Views: 74
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News