కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో

కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో మానవహారం

On
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో

నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్తగూడెం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ అన్ని కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమని సోమవారం నిర్వహించారు . కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్‌లో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. కార్మిక చట్టాల పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.జైలు భరో కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు .

Views: 45
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News