అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం
ప్రధాన కార్యదర్శి కెజిఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఆగస్టు 5: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో అమరులైన దస్తాగిరి, కే. రాంచందర్ 57వ వర్ధంతిని బుధవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్, అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా అధ్యక్షుడు పి. రాంచందర్, ప్రధాన కార్యదర్శి కెజిఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్థూపంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. వారి త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమకారుల సమితి నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో దస్తాగిరి, కే. రాంచందర్ వంటి అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భావితరాలకు వారి పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు అమరవీరులకు నివాళులర్పించారు. మలిదశ, తొలిదాశ ఉద్యమకారులు పి. రామచందర్, కామేశ్వరరావు, కొమరయ్య, వీరస్వామి, సీతారాం, మంగపతి రావు, మొహ్మద్ గౌస్, పురుషోత్తం, కృష్ణార్జునరావు, మండే అంజనేయులు, శ్రీహరి, కామేశ్వారారావు, నాగేశ్వరావు, దామేరాకొండ మల్లయ్య, భీమయ్యా, సర్వత్తం రావు, విజయకుమార్, నిజామోద్దీన్, రాజయ్య, రామలక్ష్మి, అప్పిరెడ్డి, మౌలానా, బ్రహ్మం, జక్కంపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comment List