ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 

భద్రాచలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన

On
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 

భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 27 :తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భద్రాచలం మండలంలో 24 గంటల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎస్ ఐ ఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నమోదును మరింత వేగవంతం చేయడం, ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని 145, 148, 160, 161, 165, 167, 172, 173, 174 పోలింగ్ బూత్‌లను సందర్శించి, ఆయా బూత్‌ల బూత్ లెవల్ అధికారులను కలిసి ఇప్పటివరకు జరిగిన నమోదు పురోగతి, నమోదైన శాతం, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం భద్రాచలం ఎమ్మార్వో వై. రవికుమార్ ను సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి, భద్రాచలం మండలంలోని ఎస్ ఐ ఆర్ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిపై చర్చించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ భద్రాచలం సర్ కన్వీనర్ కుంజా సంతోష్, బీజేపీ నాయకులు కుంజా ధర్మా, ములిశెట్టి రాంమోహన్ రావు, నిడదవోలు నాగబాబు, ఆవుల సుబ్బారావు, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ట్రిపుల్ ఎక్స్ చక్రవర్తి, పీసీ కేశవ్, ములిశెట్టి నిఖిల్, అన్నెం హరీష్, అన్నెం సాయి లక్ష్మణ్, జీవా, రామాచారి, షేర్ శ్రీను, పానీపూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News