మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

On
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

IMG-20260819-WA0767
రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు

ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిభట్ల సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రఘునాథ్‌ ఆధ్వర్యంలో బుధవారం రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. ఆక్రమణల కారణంగా తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని, విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఆక్రమణల తొలగింపు సమయంలో కొంతమంది స్థానికులు, వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రహదారికి ఇరువైపులా ఉన్న అన్ని ఆక్రమణలపై సమానంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. కొందరి దుకాణాల ముందు మాత్రమే ఆక్రమణలు తొలగించడం సరికాదని, మొత్తం రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. టిపిఓ సిబ్బంది శ్రీధర్ రెడ్డి, నరేందర్, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులున్నారు.

Views: 2

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News