అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..

On
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..

అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం

హైదరాబాద్, ఆగస్టు 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న అనుమానంతో విజిలెన్స్ అధికారులు అంబర్‌పేట్ గోల్నాక ధర్మకాటా వద్ద ఓ అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేసి సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ CRO కార్యాలయానికి చెందిన CSDT శ్రీమతి ఎం. వసంత కుమారి, అంబర్‌పేట్ సర్కిల్ ACSO కార్యాలయానికి చెందిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రెహమాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బృందం TG11T0799 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేపట్టింది. తనిఖీ సమయంలో వాహనంతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని, అందులో ఉన్న పీడీఎస్ బియ్యాన్ని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనానికి సంబంధించిన వ్యక్తి ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అలీని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని Essential Commodities Act, 1955లోని సెక్షన్ 6-A కింద స్వాధీనం చేసుకుని, భద్రపరచడానికి MLS Point-VI, ఆజామాబాద్‌కు తరలించారు.

IMG-20260812-WA1250
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..

పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇది TSPDS (Control) Order, 2016లోని Clause 17(e)కు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.

Views: 1

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News