కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
హరిపిరాల నుంచి ప్రారంభమైన సీపీఐ ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర
మహబూబాబాద్ జిల్లా :
జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ వల్లపు కొమురెల్లి స్మారక స్థూపం వద్ద నుంచి ఈ ప్రచార పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారధి హాజరయ్యి స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రజా చైతన్య ప్రచార యాత్రను ప్రారంబించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు ప్రజా చైతన్య ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రచార యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ ప్రచార యాత్రలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comment List