తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్ లాంచింగ్...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త మనోహర్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్ లాంచింగ్...
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 18: యువత ఎలక్ట్రిక్ వాహనాలు రంగంలో ఉపాధితో పాటు ఆదాయం పొందాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త మనోహర్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త మనోహర్‌రెడ్డి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, వ్యాపారులు భారీగా తరలివచ్చారు. ఎంజీ1 భూమి సంస్థ ఆధ్వర్యంలో ఫోర్ సీటర్, సెవెన్ సీటర్ ఆటోలతో పాటు ట్రాలీ ఆటోలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బైకులను కూడా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని ఉపాధితో పాటు ఆదాయం పొందాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, కొత్త సుజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comment List