పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ
1000 రోజుల ప్రజా ప్రభుత్వ పాలనకు ఘనంగా వారోత్సవాలు
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగామ జిల్లా
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :సెప్టెంబర్ 03
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగు శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రాజీవ్ చౌరస్తా నుంచి గుడివాడ చౌరస్తా వరకు ర్యాలీపాలకుర్తి రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ గుడివాడ చౌరస్తా వరకు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబట్టి, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో సందడిగా మారాయి.ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కార్యకర్తల్లో నూతనోత్సాహంకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్వహించిన ఈ భారీ ర్యాలీ పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటుతూ సాగిన ఈ భారీ ర్యాలీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతుండగా, కార్యకర్తల నినాదాలతో పాలకుర్తి ప్రధాన రహదారులు మార్మోగాయి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comment List