ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

On

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

IMG-20260821-WA1022
RRR EV MOTERS ను ప్రారంభించిన MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ

 

మహబూబ్ నగర్ జిల్లా, ఆగస్టు 21, న్యూస్ ఇండియా ప్రతినిధి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం RRR EV Motorsను ఆయన ప్రారంభించారు. యజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కొత్త మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఎంతో అవసరమన్నారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు బదులుగా ఈవీ స్కూటీలను వినియోగించాలని సూచించారు. కస్టమర్లకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఎలక్ట్రిక్‌ స్కూటీలను అందిస్తున్నామని తెలిపారు. స్కూటీ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఉచిత బహుమతులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ MG1 Shubham ఎలక్ట్రిక్‌ స్కూటీలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, రవి, రాథోడ్ ప్రేమ్ సింగ్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News