టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలి

On
టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలి

IMG-20230929-WA0087టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని ఎన్ ఎస్ సి ఐ అధ్యక్షులు దిలీప్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు లోకేష్ రెడ్డి అన్నారు.నారాయణఖేడ్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి నివాసం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించరు సందర్భంగా ఆర్డీవో కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు లోకేష్ రెడ్డి దీపక్ రెడ్డి ఎంఎస్సీ నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షులు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ రద్దుచేసి.యూపీఎస్సీ తరహాలో ప్రభుత్వం తరఫున ఎలాంటి జోక్యం లేకుండా ఒక కమిటీని నియమించి కమిటీ ద్వారానే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ అభ్యర్థులకు లక్ష రూపాయలు ఎస్గ్రేషియా ప్రకటించి వారు గ్రూప్ వన్ కు మూడోసారి ప్రిపేరైతున్న అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ మరియు వసతి కల్పించాలని అన్నారు.ఆర్డిఓ కి విన్నవించడం జరిగింది. గ్రూప్ వన్ నిర్వహించడంలో విఫలమైన టీఎస్పీఎస్సీని రద్దుచేయాలి అన్నారు.దేశంలోఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం పేపర్‌ లీకేజీలతో, పరీక్షల రద్దుతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నరు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రెండోసారి రద్దు కావడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. గతంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలను అమ్ముకోవడానికి ప్రయత్నించి లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేసిందని విమర్శించారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించి రెండోసారి కూడా పరీక్ష రద్దుకి రాష్ట్ర కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్యం వెంటానే టీఎస్‌పీఎస్సీని రద్దు చేసి చైర్మన్‌, సెక్రెటరీ, ముఖ్యమంత్రి అభ్యర్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ ఐ నాయకులు,సిద్ధారెడ్డి,కాలేజి రాజు,శ్రీకాంత్,శివకుమార్, ఆనంద్,మల్లేష్,బీరప్ప,విలాస్ కుమార్,శంకర్,సాంసంగ్,మల్లేష్,సంగారెడ్డి,లోకేష్ రెడ్డి‌,సాజిత్ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ వి ఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 80
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News