నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

On
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెంIMG-20260620-WA1542(1)(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.పరిశీలనలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాలైన టీజీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పాల్వంచ, శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కొత్తగూడెం, సింగరేణి ఉమెన్స్ కళాశాల కొత్తగూడెంలలో కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కౌంటర్లు, బయోమెట్రిక్ ధృవీకరణ కేంద్రాలు, పరీక్షా గదులు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ, జామర్ల ఏర్పాటు, అలారాలు, గోడ గడియారాలు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్-163 అమల్లో ఉంటుందని అన్నారు . పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను పరీక్షా సమయాల్లో మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని, అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావద్దని అభ్యర్థులకు సూచించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించి పరీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డిఓ మధు, తాసిల్దార్లు ధారా ప్రసాద్, పుల్లయ్య, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 37
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..