కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ

On
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి ) జూన్ 19:గుండాల మండలం శంభుని గూడెం గ్రామనికి చెందిన కుంజా వనజ కాన్పు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండాలలో చేరి మృతి చెందిన సంఘటనపై జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు శుక్రవారం డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్   మరియు  డిసిహెచ్ఎస్ రవి బాబు  విచారణ నిర్వహించారు. శంభునిగూడెం గ్రామ పెద్దలు , గిరిజన నాయకులు , మరియు కుంజా వనజ భర్త అయినా సంజీవరావుతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది , మృతికి గల కారణాలపై , సిబ్బంది నిర్లక్ష్యం పైన, కాన్పు సమయంలో అందవలసిన సేవలు పైన విచారణ నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండాల సిబ్బందితో మరియు గుండాల గ్రామ ప్రజలతో మాట్లాడి కుంజా వనజ మృతికి గల కారణాలపై విచారణ చేశారు.  పూర్తి విచారణ నిర్వహించి తదుపరి చర్యల కోసం సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తానని తెలిపారు.

Views: 55
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News