పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం

విద్యార్థులకు ఈ ఫలితాలు మొదటి అడుగు

On
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం

జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలి :గొల్లపూడి జగదీష్

IMG20260429162522భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 29 :పదవ తరగతి ఫలితాలలో ఎప్పటిలాగే త్రివేణి విద్యార్థులు తమ సత్తా చాటారు. టాప్ మార్కులను సాధించి తమ ప్రతిభను చూపారు. ప్రగతి ఫలాల తెలంగాణాలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుంధిభి మ్రోగించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో త్రివేణి - కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీశ్ పత్రికలకు ప్రకటనను విడుదల చేసారు. తమ విద్యార్థులు గత ఎస్.ఎస్.సి గ్రేడుల్లో మేమే, నేటి మార్కుల్లో కూడా మా త్రివేణి ముందంజలో ఉందని నిరూపించుకుంది. ఎస్.ఎస్.సి మార్కుల ప్రకారం 600కి మార్కులు 595 మా విద్యార్థిని లక్ష్మిశెట్టి నేహ  (H.TNo:2631118553) సాధించిందని తెలిపారు. 592, 591, 591, 587, 586, 586, 586, 586, 585, 585, 585, 585, 584, 583, 583, 583, 583, 583, 583, 582, 582, 582, 582, 581, 581, 581, 581, 581, 581, 581, 581, 580 32 మంది, 570 పైన సాధించినవారు 81 మంది సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ఫలితాలు సాధించి త్రివేణిని మొదటి స్థానంలో నిలిపారు.కొత్తగూడెంలోని త్రివేణి హైస్కూల్లో 600 మార్కులకు గాను బైరెడ్డి అక్షయ శివాని 592 మార్కులు, పి. అక్షయ్ 586, కె. వర్షిత 586, టి. కుండనిక 585 మార్కులను సాధించి కొత్తగూడెం త్రివేణి ఖ్యాతిని చాటిచెప్పారు, 580 పైన ఐదుగురు, 570 పైన 17 మంది, 550 పైన 57 మంది, 500 పైన 198 మంది సాధించారని డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ తెలిపారు. కొత్తగూడెం పట్టణంతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి లో తన కంటూ ఒక ప్రత్యేకతను త్రివేణి కలిగి ఉందన్నారు. అనుభవం, అంకిత భావం గల బోధనా సిబ్బంది ఉండటంవలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు.IMG20260429162724విజయం సాధించిన విద్యార్థులకు త్రివేణి పాఠశాలల డైరెక్టర్స్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, గొల్లపూడి జగదీశ్, సి. ఆర్. ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, ప్రిన్సిపాల్స్ వి.సూర్యనారాయణ మూర్తి, శ్రీనివాస్ సింగ్, నేతాజీ మరియు వైస్ ప్రిన్సిపాల్ సౌజన్య అభినందలను తెలిపారు .

Views: 96
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం