పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం

వ్యాన్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.. నలుగురు ఆస్పత్రికి తరలింపు

పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం

IMG-20260522-WA0022 మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని గంట్లకుంట రోడ్ సమీపంలో ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఒక వ్యాన్ రెండు బైక్‌లను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం పెద్దవంగరకు చెందిన కే. పరుశురాం తన భార్య వెంకటమ్మతో ఒక బైక్‌పై ప్రయాణిస్తుండగా, మరో బైక్‌పై సీహెచ్. సైదులు తన భార్య యాకలక్ష్మితో కలిసి సుతారీ పనుల కోసం తిరుమలగిరి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో తొర్రూర్ వైపు వెళ్తున్న వ్యాన్ వేగంగా వచ్చి రెండు బైక్‌లను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకటమ్మ మరియు సైదులకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ రఘు, పైలట్ నవీన్‌లు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Read More సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

Views: 180
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?