యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..

యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తున్న మధుయాష్కి గౌడ్..

On
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..

యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..

యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో మధుయాష్కి గౌడ్..

IMG-20260329-WA0844
యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తున్న మధుయాష్కి గౌడ్..

హైదరాబాద్, మార్చి 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: యువత ప్రశ్నించుకోవడం అలవర్చుకోవాలని, సమాజంలో అక్రమాలు, అన్యాయాలపై భయపడకుండా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రశ్నించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. మై భారత్ కేంద్ర - రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని  డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రెండు రోజుల పాటు జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది.  సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ  ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో 33 జిల్లాల నుంచి  155 మంది యువతీ యువకులు హాజరయ్యారు. యూనియన్ బడ్జెట్ తో పాటు  వికసిత్ భారత్ 2047 లో యువత పాత్ర పై నిర్వహించిన పోటీలలో యువతీ యువకులు భాగస్వామ్యమై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకట్టుకునే సందేశాన్ని అందించి తమ ప్రతిభ కనబరిచిన యువతీ యువకులకు మధుయాష్కీ గారు, జయేష్ రంజన్ గార్లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గారు.. వ్యాపారమయంగా మారిన ప్రస్తుత రాజకీయాలలో  గుడ్ గవర్నెన్స్ కోసం యువత ప్రశ్నించడం మొదలు పెట్టాలన్నారు. ఉన్నతమైన విలువలతో కూడిన  రాజకీయాలలోకి యువత రావాలని సూచించారు. మహిళల పాత్ర లేకుండా వికసిత భారత్ సాధ్యం కాదని, త్వరలోనే మహిళా రిజర్వేషన్లు అమలు కానుండడం మహిళా సాధికారతకు దోహదం చేస్తుందన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాయంలోనే మహిళలకు రిజర్వేషన్ల  ప్రాధాన్యతను గుర్తించి.. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను అమలు చేశారని గుర్తు చేశారు.  యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మై భారత్ స్టేట్ డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్ దాస్, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఐజయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..