ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం

పెండింగ్ ఫీజులు రేయంబర్స్మెంట్స్ విడుదల చేయకపోతే ఉద్యమం: నిర్వహిస్తాం-జార్జి రెడ్డి పిడిఎస్యు

On
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం

ఖమ్మం ఏప్రిల్ 5 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తుందని జార్జి రెడ్డి PDSU తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పర్చిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనేక రోజులుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వాలు ఫీజు బకాయిలు విడుదల చేస్తామని గడువులు పెడుతూ కాలం గడుపుతున్నాయి, కానీ నిధులు మాత్రం రిలీజ్ చేయడం లేదు అన్నారు.ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ నిధులు తక్షణమే విడుదల చేయాలని జార్జిరెడ్డి PDSU తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. లేనియెడల దశల వారి ఉద్యమాలను నిర్వహిస్తుందనీ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కె.స్వాతి,జిల్లా అధ్యక్షులు మందా సురేష్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కె.స్వాతి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మందా సురేష్,జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి రాము, జిల్లా గర్ల్స్ కన్వీనర్ పైండ్ల శ్యామల తదితరులు పాల్గొన్నారు.

IMG-20260404-WA0199

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News