జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ

అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నాకాబందీ ప్రత్యేక తనిఖీలు

On
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ

జిల్లా ఎస్పి రోహిత్ రాజు

IMG-20260425-WA1678భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి):జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకాబంది కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు.శనివారం రాత్రి 7:30 నుండి 10 గంటల వరకు ఈ నాకాబందీ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనుగొనడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు .గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం,రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టడం,పాత నేరస్తులను కనిపెట్టే విధంగా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ప్రతి ఒక్కరి వేలిముద్రలను తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు.జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ల డిఎస్పీల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాలలో కూడా ఈ నాకాబందీని నిర్వహించినట్లు వెల్లడించారు.ఇట్టి తనిఖీలలో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.IMG-20260425-WA1616

Views: 59
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు కొరిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లా:- పెద్ద వంగర మండలం:- మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కొరిపల్లి గ్రామంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొట్టిముక్కల సిద్ధార్థ్...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ