రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్..
On
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
రంగారెడ్డి జిల్లా, మార్చి 21, న్యూస్ ఇండియా ప్రతినిధి:
తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్ రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ ప్రారంభం నుండి ముస్లిం సోదరులు నియమ నిష్ఠలతో ఉపవాసాలు ఉండి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పవిత్ర మాసాన్ని గడుపుతారని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపాలని, దేవుని కృపతో ప్రతి కుటుంబం పిల్లాపాపలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందేలా రంజాన్ పండుగ దోహదపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చివరిగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Views: 19
About The Author
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List