మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం

On
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల కోసం  ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .కొత్తగూడెం బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గుర్రం భావితా రెడ్డి (ఎంబిబిఎస్, ఎమ్మెస్ – గైనకాలజీ, గోల్డ్ మెడలిస్ట్, ల్యాపరోస్కోపీ మరియు ఇన్ఫర్టిలిటీ నిపుణురాలు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ భావితా రెడ్డి మాట్లాడుతూ మహిళల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా, పురుష న్యాయవాదులు పాల్గొన్నారు.

Views: 43
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..